: ఆసియాలోకెల్లా 'అత్యంత పరిశుభ్రమైన గ్రామం' మేఘాలయలో ఉంది!


ఆసియాలోకెల్లా అత్యంత పరిశుభ్రమైన గ్రామం భారత్ లో ఉంది. ఆ గ్రామం మేఘాలయలో ఉంది. పేరు మాలిన్నోంగ్. ఈ గ్రామ జనాభా 530. ఇక్కడ ప్రతి ఇంటికి టాయిలెట్లు, వ్యర్థాలు వేసేందుకు ప్రతి రహదారి పక్కన వెదురు బుట్టలు ఉంటాయట. ఇక, గ్రామంలోని విద్యార్థులు తమ పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. మాలిన్నోంగ్ గ్రామస్థులు శుభ్రతను జీవితంలో ఓ భాగంగా పాటిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తూ కొద్దికొద్దిగా శుభ్రం చేస్తున్నారు. కానీ, ఎప్పటినుంచో ఈ గ్రామంలో పరిశుభ్రతను విధిగా పాటిస్తున్నారని ఇండియా డిస్కవరీ మ్యాగజైన్ తెలిపింది. దాంతో, 2003లోనే "ఆసియా అత్యంత శుభ్రమైన గ్రామం"గా మాలిన్నోంగ్ ఎంపికైంది. 2007లో గ్రామంలో బహిరంగంగా మల విసర్జనకు వెళ్లే పద్ధతి నిర్మూలించి, ఉన్న 91 ఇళ్లకు 'నిర్మల భారత్ అభియాన్' కింద అందరికీ మరుగుదొడ్లు కట్టించారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ, "నా చిన్నతనం నుంచి ఈ గ్రామం పరిశుభ్రంగా ఉండేది. మా అమ్మమ్మ వాళ్ల కాలంలో అలా ఉందని విన్నాం. శుభ్రంగా ఉంచడం ఇక్కడి ప్రతి ఒక్కరి బాధ్యత" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News