: ఓబులేష్ దొరికాడు... సాక్ష్యాలు కూడా దొరికాయి!
కేబీఆర్ పార్క్ కాల్పుల నిందితుడు ఓబులేష్ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం పోలీసులు అదుపులో వారి 'ఆతిథ్యం' స్వీకరిస్తున్నాడు. కాల్పులు జరిపిన తరువాత జింఖానా క్లబ్ పక్కనుంచి ఒబులేష్ పారిపోయాడు. కేబీఆర్ పార్కులోకి ఓబులేష్ వచ్చిన దృశ్యాలు, పారిపోయిన దృశ్యాలున్న సీసీ టీవీ పుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓబులేష్ తో పాటు మరో ముగ్గురి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఓబులేష్ తో కాల్పుల్లో మరో ఇద్దరు పాల్గొన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, కేబీఆర్ పార్క్ కాల్పుల కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించడం విశేషం. నిన్న ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కు వెళ్లిన పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఓబులేష్ కాల్పులు జరిపి పరారైన సంగతి తెలిసిందే.