: మా గొంతులు నొక్కేస్తున్నారు: డీకే అరుణ
ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవడం ఎన్నో రంగాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా, రాజకీయాల్లో సర్వసాధారణం. గతంలో తమ గొంతులు నొక్కేస్తున్నారంటూ టీఆర్ఎస్ వాళ్లు ఆక్రోశించిన విధంగా, ఇప్పడు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో గంటల తరబడి నిలుచుని అరిచినా మైకులు ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆరోపించారు. శాసనసభ జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆమె తెలిపారు. అధికార పక్షం వారి సంకేతాల మేరకే మైకులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ సభను అధికార పక్షం నేతలే పక్కదారిపట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పింఛను సమస్యపై చర్చించకుండా 'గత ప్రభుత్వాలు...' అంటూ విమర్శలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.