: ఇండియన్ ఫుడ్ అంటే పడిచస్తున్న 'నల్ల కలువ'
టెన్నిస్ అభిమానులకు వీనస్ విలియమ్స్ అనేక గ్రాండ్ స్లామ్ లు గెలిచిన స్టార్ క్రీడాకారిణిగానే తెలుసు. కానీ, ఆమె భారతీయ వంటకాలంటే పడిచస్తుందన్న విషయం మాత్రం ఎక్కువమందికి తెలిసుండకపోవచ్చు. ప్రస్తుతం చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) లో ఆడుతున్న ఈ నల్ల కలువ, బెంగళూరులో 94.3 ఎఫ్ఎం రేడియో స్టేషన్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఇండియన్ ఫుడ్ పై తన మక్కువను చాటుకుంది. అన్ని వంటకాల్లోకెల్లా 'భీండీ మసాలా' అంటే ఎంతో ఇష్టమని లొట్టలేసింది. "ఎన్నో రకాల భారతీయ వంటకాలు లాగించాను. నా ఫేవరెట్ మాత్రం భీండీ మసాలానే" అని పేర్కొంది.