: ఏపీ ఎన్జీవో కార్యాలయానికి టి.ఉద్యోగులు తాళం వేశారు


హైదరాబాదు గన్ పౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు. ఏపీ ఎన్జీవోలో సభ్యులమైన తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామని అడిగితే అశోక్ బాబు స్పందించడం లేదని టీ-ఉద్యోగులు ఆరోపించారు. అందుకు అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ఉద్యోగులు ఈ రోజు కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీవో) సంఘం అధ్యక్షుడు పి.అశోక్ బాబు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News