: దేశంలో అల్లర్లపై శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతాం: మమతా బెనర్జీ
ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంలోనే వేడి పుట్టించనున్నాయి. వచ్చేవారం నుంచి మొదలయ్యే సమావేశాల్లో, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో పలుచోట్ల జరిగిన అల్లర్లపై చర్చను లేవనెత్తుతామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. "దేశంలో ఇంత అకస్మాత్తుగా ఎందుకు అల్లర్లు జరిగాయి? ఢిల్లీలో కూడా ఇటీవల అల్లరు చూశాం. ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ లలో పలుచోట్ల అల్లర్లు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం, ఇది చాలా తీవ్రమైన సమస్య. మా పార్టీ తప్పకుండా అల్లర్లపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తుంది" అని మమత పేర్కొన్నారు.