: యువతిని వేధించొద్దు అన్నందుకు చావగొట్టారు


రోడ్డుపై నడిచివెళ్తున్న యువతిని వేధిస్తున్న వారిని వారించబోయి దెబ్బలు తిని ఆసుపత్రి పాలయ్యాడు ఓ యువకుడు. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి మణిపూర్ కు చెందిన 21 సంవత్సరాల విద్యార్థి రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళను వేధిస్తున్న ముగ్గురు తాగుబోతులను అతను వారించాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ ముగ్గురూ మణిపూర్ యువకుడిని చావబాదారు. తలకు తీవ్ర గాయాలైన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, గతనెలలో ఓ రెస్టారెంట్ లో కన్నడ మాట్లాడలేదని మణిపూర్ కే చెందిన మరో యువకుడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News