: సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కేసుకు సంబంధమున్న వారంతా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు రావడంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలతోపాటు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు కోర్టుకు వచ్చారు.