: నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడి గుర్తింపు
ఈ ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా యజమాని నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. సాయంత్రంలోగా నిందితుడిని గుర్తిస్తామని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగించిన దుండగుడు రెండు రోజుల క్రితం మెహిదీపట్నంలో షాపింగ్ చేశాడని వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు మొదలుపెట్టాయి.