: 'ముసలితనం' అంతా అనుకోవడంలోనే ఉందిట!
'యద్భావం తద్భవతి' అంటుంది సంస్కృతశ్లోకం. నువ్వు ఏం అనుకుంటే అదే జరుగుతుంది అని భావం. అచ్చంగా లండన్ శాస్త్రవేత్తలు తాజాగా తెగ అధ్యయనాలు చేసి ఇదే విషయాన్ని తేల్చిచెబుతున్నారు. వయసు మీద పడిపోయింది.. ఇక ఏమీ చేయలేం.. మా వల్ల అయ్యేదేమీ లేదిక.. అనుకునేవాళ్ల జీవనప్రమాణం త్వరగా పడిపోతుందిట. అలాంటి వారికే వ్యాధులు ఎక్కువగా సోకుతుంటాయిట. నేను ముసలాడిని అనుకునే వాళ్లే.. ఆరోగ్య సమస్యలతోనూ కొట్టుమిట్టాడుతున్నారు తప్ప.. మనసులోకి వార్ధక్యాన్ని చొరబడనివ్వని వారు ఆరోగ్యంగానే ఉంటున్నారట. లండన్లోని ఎక్సెటర్ మెడికల్ స్కూల్కు చెందిన క్రిస్టల్ వార్మోత్ బృంద సభ్యులు వృద్ధులతో ముఖాముఖి సంభాషించి.. ఈ అధ్యయనాన్ని తేల్చి చెప్పారు.