: బ్యూటీ క్వీన్ కిమ్ కర్దాషియన్ కంటే మోదీకే ప్రాధాన్యత ఇచ్చారు!


ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఆస్ట్రేలియా మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. పర్యటనలో భాగంగా ఆయన పాల్గొన్న కార్యక్రమాల వివరాలను పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించగా, అటు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మోదీ పర్యటనను పూర్తిస్థాయిలో కవర్ చేసింది. దీంతో, ఆస్ట్రేలియా వ్యాప్తంగా మోదీ చర్చనీయాంశం అయ్యారు. 'గ్లోబల్ గ్లామర్ క్వీన్' గా పేరుగాంచిన అమెరికా ముద్దుగుమ్మ కిమ్ కర్దాషియన్ ఓవైపు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా, ఆమె కంటే మోదీ పర్యటన కవరేజికే ఆసీస్ మీడియా మొగ్గు చూపింది. ఆహార్యం మొదలుకొని, ఉపన్యసించే తీరు, హావభావాలు, భావాల్లో స్పష్టత, భావ తీవ్రత, ముఖ్యంగా ఆయన హాస్య చతురత తదితర అంశాలు ఆస్ట్రేలియన్లను బాగా ఆకట్టుకున్నాయి. కాగా, ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ చారిత్రక సందర్భాన్ని ఆస్ట్రేలియా అధికారిక వార్తా చానల్ ఏబీసీ లైవ్ టెలికాస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News