: 'మహా' ప్రభుత్వాన్ని పడగొట్టం: పవార్
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనేదీ తమకు లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావిస్తే తమ నిర్ణయం మారుతుందని ఆయన అన్నారు. పూణే సమీపంలోని అలీబూగ్ లో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని పవార్ హెచ్చరించారు.