: నితీశ్ కుమార్ నా 'ఆరాధ్య దైవం': బీహార్ సీఎం


బీహార్ సీఎం జితన్ రాం మంఝికి, మాజీ సీఎం నితీశ్ కుమార్ కు మధ్య విభేదాలు వచ్చాయని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఆయన మాత్రం రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా తనను చేసినందుకు నితీశ్ కు కృతజ్ఞత తెలుపుకున్నారు. ఈ మేరకు మంఝి మాట్లాడుతూ, "మిగతావారి కన్నా నితీశ్ కు విశాల హృదయం, ధైర్యం ఉన్నాయి. నితీశ్ నాకు ఆరాధ్య దైవం. పంచాయతీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు ఆయన సరైన ప్రాతినిథ్యం కల్పించారు" అని కీర్తించారు.

  • Loading...

More Telugu News