: ఏపీ రాజధాని కోసం జపాన్ తోనూ చర్చలు: మంత్రి పి.నారాయణ


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జపాన్ తో చర్చించనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. త్వరలో జరిగే జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని నిర్మాణం అంశాన్ని చర్చిస్తామని, అంతా అనుకున్నట్టు జరిగితే జపాన్ తో కలిసి పని చేయడానికి సింగపూర్ కూడా ఆస్తకి చూపిందని ఆయన తెలిపారు. ఏపీ రాజధాని పరిధిలో మొత్తం మూడు రింగ్ రోడ్లు వస్తాయని, ఇవి 75, 125, 225 కిలోమీటర్ల పొడవుంటాయని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో నియమ నిబంధనలపై అధికారులతో తాము చర్చించామని, మరో వారంలో విధివిధానాలను ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించినట్టు నారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News