: ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలనడం సరికాదు: కోదండరాం


రెండు రాష్ట్రాల ఇంటర్మీడియట్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలంటున్నారని నల్గొండలో మీడియా ముందు మండిపడ్డారు. ఇంటర్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించేందుకు గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని కోదండరాం కోరారు. మరోవైపు, ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గవర్నర్ తో సమావేశమై, ఈ వివాదంపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News