: పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన కానిస్టేబుళ్లు


వారంతా పోలీసులు. వారిలో కొందరు ప్రముఖుల గన్ మెన్లు కూడా. డ్యూటీ అయిపోయింది, ఇంకేమిలే అనుకున్నారో... లేకుంటే, మనం పోలీసులం ఎవరు అడ్డుకుంటారులే అనుకున్నారోగానీ, 9 మంది కానిస్టేబుళ్లు పేకాటకు తెరదీశారు. అయితే, అడ్డంగా దొరికిపోయారు. గుంటూరు నగరంలోని సితార లాడ్జిపై పోలీసులు దాడి చేసి పేకాడుతున్న కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.36 లక్షల నగదుతోపాటు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కానిస్టేబుళ్లలో ఇద్దరు స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద గన్ మెన్లుగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. లాడ్జీలో కొందరు పేకాట ఆడుతున్నారని సమాచారం తమకు అందిందని దీంతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News