: ఎవరితోనూ నాకు శత్రుత్వం లేదు: అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్


తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి తెలిపారు. తనపై కాల్పులు జరిపిందెవరో కూడా తెలియదన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆగంతుకుడికి సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందని, తన వెనకాలే కారులో ఎక్కి తుపాకి గురిపెట్టాడని వివరించారు. హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో ఈ ఉదయం నిత్యానందరెడ్డిని ఏకే 47తో గుర్తు తెలియని ఓ వ్యక్తి బెదిరించి, కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తరువాత ఘటనాస్థలం వద్ద పోలీసులకు ఎనిమిది బుల్లెట్ షెల్స్ లభ్యమయ్యాయి. ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుగుతోంది.

  • Loading...

More Telugu News