: పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నియమితులయ్యారు. హైదరాబాదులోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా వ్యవహరించిన నరసింహారెడ్డి పదోన్నతి మీద పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయమూర్తుల నియామక కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న జస్టిస్ రేఖా మన్హర్ లాల్ దోషిత్ వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నరసింహారెడ్డి బాధ్యతలు చేపడతారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన జస్టిస్ నరసింహారెడ్డి 1979లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.