: శారదా కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రికి సమన్లు జారీ చేసిన సీబీఐ
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో విచారణ జరుపుతున్న సీబీఐ తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ్రిన్ జాయ్ బోస్ లకు సమన్లు జారీ చేసింది. వీరిని ఒక వారంలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. శారదా స్కాంలో ఒక మంత్రికి సమన్లు జారీ కావడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్ తో పాటు ఒడిశాలో, అధిక రాబడి ఉంటుందని నమ్మి శారదా గ్రూప్ లో పెట్టుబడులు పెట్టి లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే.