: సోదరుడి రాకతో బతికిపోయిన నిత్యానందరెడ్డి


అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి, తన సోదరుడు ప్రసాదరెడ్డి కారణంగానే బతికి బట్టకట్టారు. ఈరోజు మార్నింగ్ వాక్ కు సోదరుడితో కలిసి నిత్యానందరెడ్డి కేబీఆర్ పార్కుకు వచ్చారు. మార్నింగ్ వాక్ ముగిసిన అనంతరం ఇంటకెళ్లే క్రమంలో ఆయన కారులో కూర్చోగానే, ఆగంతుకుడు బలవంతంగా కారులోని వెనుక సీట్లోకి ప్రవేశించాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న ఏకే 47తో నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపాడు. అయితే ఊహించని పరిణామానికి ఏమాత్రం భయపడని నిత్యానందరెడ్డి, ఆగంతుకుడి చేతిలోని తుపాకిని గట్టిగా పట్టుకున్నారు. అయినా, దుండగుడు మూడు రౌండ్ల మేర కాల్పులు జరిపాడు. అక్కడికి సమీపంలోనే ఉన్న ప్రసాదరెడ్డి దీనిని గమనించి, పరుగున అక్కడికి వచ్చి ఆగంతుకుడిని వెనుక నుంచి గట్టిగా పట్టేశారు. దీంతో అక్కడ ఇద్దరు వ్యక్తులున్నారని, తన పథకం పారదని గ్రహించిన దుండగుడు ప్రసాదరెడ్డి పట్టు విడిపించుకుని, ఎదురుగా ఉన్న అశోకా బిల్డర్స్ భవనం వైపు పరుగులు తీశాడు. ప్రసాద రెడ్డి అక్కడ లేకుండా ఉంటే, నిత్యానందరెడ్డి ప్రాణానికి ముప్పు తప్పేది కాదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News