: 'అరబిందో' నిత్యానందరెడ్డిపై ఆగంతుకుడి కాల్పులు
హైదారాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసున్నాయి. అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు. పార్కు వద్ద కారులో కూర్చున్న నిత్యానందరెడ్డిపై ఆ యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిస్పందనగా నిత్యానందరెడ్డి కూడా ఆగంతుకుడిపై కాల్పులు జరపడంతో ఏకే 47ను అక్కడే వదిలేసిన దుండగుడు పరారయ్యాడు. ఇరువురి మధ్య దాదాపుగా 15 రౌండ్ల మేర కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో మార్నింగ్ వాక్ కు వచ్చిన వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.