: నేడు తెలుగు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో గవర్నర్ భేటీ


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు తెలుగు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల్లో జరగనున్న ఇంటర్ పరీక్షలతో పాటు పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. ఇంటర్ పరీక్షలకు సంబంధించి రెండు రాష్ట్రాలు వేర్వేరుగా టైంటేబుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగానే నిర్వహించుకుందామన్న ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనకు తెలంగాణ విద్యా మంత్రి జగదీశ్ రెడ్డి ససేమిరా అన్నారు. అంతేకాక తాము ప్రత్యేకంగానే ఇంటర్ పరీక్షలను నిర్వహించుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ అగాధాన్ని తొలగించేందుకే గవర్నర్ ఈ భేటీని నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News