: అనాథలా వచ్చి అదిరిపోయేలా వివాహం చేసుకుంటూ... సల్మాన్ సోదరి గాథ ఇది!


భారత సినీ రంగం దృష్టంతా ఇప్పుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ వేడుకపైనే ఉంది. ప్రస్తుతం హైదరాబాదు ఫలక్ నుమా ప్యాలెస్ లో ఆమె పరిణయ మహోత్సవం జరుగుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, అర్పిత సల్మాన్ సొంత సోదరి కాదు. ఆమె కొన్ని విషాదకర పరిస్థితుల నేపథ్యంలో సల్మాన్ కుటుంబంలోకి ప్రవేశించింది. కొన్నేళ్ల క్రితం అర్పిత తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అర్పిత అప్పటికి చిన్నపిల్ల. తల్లి మరణించడంతో, అర్పిత రోడ్డుపై దీనంగా కనిపించింది. దీంతో, ఆ చిన్నారి పరిస్థితి చూసి సల్మాన్ తండ్రి, ప్రసిద్ధ రచయిత సలీం ఖాన్ చలించిపోయారు. వెంటనే ఆమెను ఇంటికి తీసుకువచ్చి దత్తత చేసుకున్నారు. అర్పితను కన్నబిడ్డ కంటే మిన్నగా చూశారు సలీం ఖాన్ దంపతులు. ఆయన కుమారులు సల్మాన్, అర్బాజ్, సొహెయిల్ కూడా అర్పితపై విపరీతమైన మమకారం పెంచుకున్నారు. ఇప్పుడు తన మనసుకు నచ్చినవాడితో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించడం చూస్తుంటేనే అర్థమవుతోంది అర్పితపై వారికెంత ప్రేమ ఉందో. ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతున్న పెళ్లి వేడుక ఖర్చు రూ.2 కోట్లు కాగా, బంగారు చెల్లికి సల్మాన్ ముంబయి కార్టర్ రోడ్డులో రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడట. అర్పిత అదృష్టం అనడం కంటే, ఇదంతా సల్మాన్ కుటుంబం గొప్పదనంగానే చెప్పుకోవాలి.

  • Loading...

More Telugu News