: శారదా స్కాంలో నా పాత్ర ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా బెనర్జీ
ఒడిశా కోట్ల రూపాలయ శారదా చిట్ ఫండ్ స్కాం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు మమతా స్పందిస్తూ, ఈ స్కాంలో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలిపారు. ఓ ఆంగ్ల ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో తానేమీ కప్పిపుచ్చడం లేదన్నారు. అయితే, శారదా గ్రూపుతో మీకు దగ్గర సంబంధాలున్నాయి కదా? అనడిగితే, 'ఎవరు చెప్పారు?' అని మమతా తిరిగి ప్రశ్నించారు. ముందు సాక్ష్యాలతో నిరూపించాలని, అదే కనుక జరిగితే పదవిని వైదొలగుతానని స్పష్టం చేశారు. ఈ స్కాంకు మూలాలు వామపక్ష ప్రభుత్వం (సీపీఐ (ఎం))లోనే ఏర్పడ్డాయన్నారు. తమ ప్రభుత్వం కాలంలో జరగలేదని వామపక్ష ప్రభుత్వ కాలంలోనని అన్నారు.