: అమితాబ్ పలుకులు లతా మంగేష్కర్ కు కన్నీళ్లు తెప్పించిన వేళ!
గానకోకిల లతా మంగేష్కర్ అంతటి వ్యక్తిని అమితాబ్ బచ్చన్ మాటలు కదిలించాయి! కౌన్ బనేగా కరోడ్ పతి-8 సీజన్ ముగింపు సందర్భంగా అమితాబ్ పలుకులు లతాజీకి కన్నీళ్లు తెప్పించాయట. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. "కేబీసీ షో ఎంతో బాగుంది. ఎప్పట్లానే అమిత్ జీ ఈ సీజన్ ను కూడా అద్భుతంగా చేశారు. సీజన్ ముగింపు సందర్భంగా ఆయన పలికిన 'మొహబ్బత్ కర్నేవాలే కమ్ న హోంగే, తేరీ మెహ్ ఫిల్ మే లేకిన్ హమ్ న హోంగే' అన్న వాక్యాలతో నా కళ్లలో నీళ్లు నిండాయి" అని పేర్కొన్నారు. తన హృదయంలో అమితాబ్ కు ప్రత్యేకస్థానం ఉందని తెలిపారు. లతా మంగేష్కర్ ట్వీట్లకు బిగ్ బి బదులిచ్చారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదని ఆయన ట్వీట్ చేశారు.