: పెట్టుబడులతో వచ్చేవారికి 'సింగిల్ విండో' అనుమతులు : మోదీ


ఇండియాలో పెట్టుబడులు పెట్టేవారికి ఎర్ర తివాచి పరచి స్వాగతం పలుకుతామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ఆఖరిరోజు పర్యటనలో భాగంగా మెల్బోర్న్ వచ్చిన ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భారత్ లో ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన పారిశ్రామిక కారిడార్ లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పెట్టుబడులతో వచ్చేవారికి అవసరమైన అనుమతులను సత్వరం ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నట్టు మోదీ తెలిపారు. అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్టు వివరించారు. భారత జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని గుర్తు చేశారు. ఒక హాలీవుడ్ సినిమాకు పెట్టే ఖర్చు కన్నా తక్కువతో మార్స్ ఆర్బిటర్ మిషన్ ను విజయవంతం చేశామని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News