: బాబా రాంపాల్ ప్రైవేట్ ఆర్మీ దాడిలో 12 మంది పోలీసులకు గాయాలు
హిసార్ లోని బాబా సంత్ రాంపాల్ ప్రైవేట్ ఆర్మీ తెగబడిన దాడిలో 12 మంది హర్యానా పోలీసులకు గాయాలయ్యాయి. కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపైకి బాబా గూండాలు నాటు బాంబులతో దాడికి దిగారు. ఈ దాడిలో 12 మంది పోలీసులకు గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. మరోవైపు పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ దాడిలో బాబా భక్తుల్లో చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ ఇరువర్గాల వారిని పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అయినా బాబా భక్తులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. బాబాను అరెస్ట్ చేసేందుకు మరిన్ని పోలీసు బలగాలు సత్ లోక్ ఆశ్రమానికి తరలివెళుతున్నాయి.