: హిసార్ ఘటనపై హర్యానా సీఎం అత్యవసర భేటీ


హిసార్ లోని బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద నెలకొన్న తాజా పరిస్థితిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. రాంపాల్ నిలువరింతపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఆథ్యాత్మిక ఆశ్రమంగా కొనసాగుతున్న రాంపాల్ ఆశ్రమం నుంచి ఆయన మద్దతుదారులు పోలీసుల పైకి నాటు బాంబులతో దాడికి దిగారు. దీంతో అసలు ఆశ్రమంలో ఏ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబా భక్తుల పేరిట గూండాలు బాంబులు, రాళ్లతో దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, రాంపాల్ ను నిలువరించేందుకు మరిన్ని కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News