: ఉద్యమంలో చెమట చుక్క రాల్చని వారికి కూడా పదవులు... ఇదీ కేసీఆర్ నైజం: సండ్ర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క చెమట చుక్కను కూడా రాల్చని వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ... పరోక్షంగా తుమ్మలపై సెటైర్ విసిరారు. మరోవైపు, ఉద్యమంలో పాల్గొనని వారికి కూడా స్వలాభం కోసం పదవులను కట్టబెట్టేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నైజం ఏమిటన్నది ఆ పార్టీ నేతలు గ్రహించాలని సూచించారు. కేసీఆర్ కుటిల నీతిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి ఇంటిపై దాడులకు పాల్పడటం, టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని చెప్పారు.