: ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం: లక్ష్మణ్


అర్హులైన పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేసేంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత కూడా పింఛన్ల కోసం మళ్లీ దరఖాస్తులు అడుగుతున్నారని మండిపడ్డారు. ఒక్క హైదరాబాదులోనే 4.60 లక్షల పింఛన్ దరఖాస్తులను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రజా సమస్యలపై విపక్షాలు నిలదీస్తుంటే... సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తప్పించుకుంటోందని తెలిపారు. సభ వాయిదా పడిన సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News