: భారత్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ లు ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సామాజిక భద్రత ఒప్పందం సానుకూలమైన పరిణామమని అన్నారు. భద్రత సహకారంపై కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇక 2015లో ఆస్ట్రేలియాలో 'మేక్ ఇన్ ఇండియా' ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందని ఆకాంక్షిస్తున్నామని ఆస్ట్రేలియా పీఎం అబాట్ పేర్కొన్నారు.