: నేటి నుంచి అందుబాటులో కిసాన్ వికాస పత్రాలు... 100 నెలల్లో పెట్టుబడి రెట్టింపు


మధ్య తరగతి ప్రజల్లో ఎంతో గుర్తింపు ఉన్న కిసాన్ వికాస పత్రాలను మరోసారి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కిసాన్ వికాస పత్రాలను పునరావిష్కరించనున్నారు. ఇవి 1000, 5 వేలు, 10 వేలు, 50 వేల రూపాయల విభాగాల్లో లభిస్తాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పత్రాల్లో పెట్టుబడికి గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ ఉండదు. 8 సంవత్సరాలా 4 నెలల్లో... పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పన్ను రాయితీలు వర్తిస్తాయి. ప్రస్తుతానికి పోస్టాఫీసుల ద్వారా వీటిని విక్రయించనున్నట్టు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా తొలుత ఈ పత్రాలను 1988 ఏప్రిల్ లో విడుదల చేశారు. అప్పట్లో 5 సంవత్సరాల 5 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అయ్యేట్టు విధివిధానాలను నిర్ణయించారు. నవంబర్ 2011లో స్కీంను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News