: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం... చర్చ కోసం కాంగ్రెస్ పట్టు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే పార్టీ ఫిరాయింపులపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు సిద్ధపడ్డారు. అయితే, ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ తమ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టింది. దీనిపై స్పీకర్ మరోమారు పరిశీలన చేయాలని టీకాంగ్ నేత జానారెడ్డి కోరారు. సభ్యులు సభా కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.