: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం... రెండు కీలక బిల్లులకు ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఉదయం పది గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో నవ్యాంధ్ర రాజధానికి సంబంధించిన రెండు కొత్త బిల్లులకు ఆమోదం లభించనుందని సమాచారం. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, మారిటైం బోర్డు ఏర్పాటుకు సంబంధించి రెండు బిల్లులపై నేటి భేటీలో కేబినెట్ ప్రధానంగా చర్చించనుందని తెలుస్తోంది. ఇక ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపైనా కేబినెట్ చర్చించనుంది.