: మాట్లాడి, మాట్లాడి గొంతు పోయింది, మిమ్మల్ని చూశాక గొంతు వచ్చింది: చంద్రబాబు


విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ప్రజలు చూపిన ఆదరణ ఇంతవరకు ఎక్కడా చూడలేదని కితాబిచ్చారు. "తుపాను నష్టం నేపథ్యంలో దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చొద్దని సూచించాం. అందరూ ఆ సూచనను పాటించారు. అధికారులు పట్టుదలతో పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారు. నగరమంతా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక్క చోట కూడా పాత బల్బులు కనిపించవు. తుపాను బాధితుల కష్టాలు తీర్చేందుకు శాయశక్తులా కృషి చేశా. ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో మాట్లాడి మాట్లాడి గొంతుపోయింది, మరలా మిమ్మల్ని చూశాక గొంతు వచ్చింది. బంగారం కంటే విలువైన తమ్ముళ్లు, ఆడబిడ్డలు విశాఖలో ఉన్నారు. మంచివాళ్లకు మారుపేరు విశాఖపట్నం. మనం తలుచుకుంటే విశాఖను బ్రహ్మాండమైన నగరంగా తయారుచేసుకోవచ్చు. నగరంలో పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖను అంతర్జాతీయ నగరంగా మార్చే వరకు విశ్రమించను. నగరాన్ని వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తా, గొప్ప పారిశ్రామిక నగరంగా మారుస్తా. హైదరాబాదును అభివృద్ధి చేసింది నేనే" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News