: వెంకటాయపాలెంలో మంత్రి వర్గ ఉపసంఘానికి నిరాశ


రాజధానికి భూసమీకరణ కోసం మంత్రి వర్గ ఉపసంఘం గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఉపసంఘం రైతులతో సమావేశమైంది. అయితే, మంత్రులకు అక్కడ నిరాశ తప్పలేదు. భూములిచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. భూసేకరణ ప్రక్రియకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెళ్లిపోవాలని రైతులు నినాదాలు చేశారు. అటు, మంగళగిరి మండలం నిడమర్రులో జరిగిన భూసమీకరణ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతులు భూసమీకరణను వ్యతిరేకించారు.

  • Loading...

More Telugu News