: 'యువత' అంటే ఇదీ... మలేసియా సర్కారు కొత్త భాష్యం


'యువత' అని ఎవరిని పరిగణించాలన్న దానిపై మలేసియా సర్కారు వివరణ ఇచ్చింది. 30 ఏళ్ల లోపు వ్యక్తులనే యువతగా పేర్కొనాలని తీర్మానించింది. 2018 నాటికి ఈ నిర్ణయం అమలు చేయాలని భావిస్తోంది. మలేసియా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ దీనిపై ఓ ప్రకటన జారీ చేశారు. ఇకపై, దేశంలో యువజన సంఘాల అధ్యక్షులుగా 30 ఏళ్ల లోపు వారే అర్హులవుతారు. యువకుల్లో నాయకత్వ పటిమ పెంపొందించేందుకు ఈ నిర్ణయమట!

  • Loading...

More Telugu News