: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచుతున్నారట!
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. వారి వేతనాలను రూ.2 లక్షలకు పెంచాలని భావిస్తున్నారట. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జీతాల పెంపు కారణంగా ఖజానాపై ఏటా రూ.150 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు లక్ష రూపాయల జీతం అందుకుంటున్నారు. జీతాల పెంపుతో పాటు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛన్ ను పెంచడం , ఎంపీలకు మెరుగైన అలవెన్స్ లు తదితర అంశాలపైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.