: పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు
హైదరాబాదులోని తమ కార్యాలయంపై తెలంగాణ వాదులు దాడులకు పాల్పడుతున్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దాడుల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యమాలు చేయడం, సమస్యలపై పోరాడడం భారతీయుల నైతిక హక్కు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని అశోక్ బాబు తెలిపారు. దాడులపై హోం మంత్రిని కలిసి వివరిస్తామని పేర్కొన్నారు.