: డెల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్
ప్రముఖ కంప్యూటర్ల తయారీదారు 'డెల్' మరో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. డెల్ వెన్యు 7, డెల్ వెన్యు 8 పేరుతో తాజా మోడళ్లు భారత మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ నూతన టాబ్లెట్స్ లో 3జీతో పాటు వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీంట్లో, 4,550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, లేటెస్ట్ డ్యూయల్-కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఓఎస్ ఉన్నాయి. ఇక, డెల్ వెన్యు 7లో 7 అంగుళాల డిస్ ప్లే, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీని ప్రత్యేకతలు. డెల్ వెన్యు 8లో పూర్తి హెచ్ డీ డిస్ ప్లే, 1 జీబీ రామ్, 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నారు. వాటి ధరల విషయానికొస్తే, వెన్యు 7 రూ.14,999తో, వెన్యు 8 రూ.18,999తో మార్కెట్లో లభ్యమవుతాయి.