: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలకు గుంటూరులో భవనాల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలోని భవనాలను అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఈరోజు పరిశీలించారు. అక్కడి డైక్ మన్ హాల్, ఇంజనీరింగ్ కళాశాల భవనాలను చూశారు. డైక్ మన్ హాలులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా కార్యదర్శి చెప్పారు. అటు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు కేటాయించే రూములు, ఇతరత్రా విషయాలన్నింటిపైనా త్వరలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తామని తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలై పది రోజుల పాటు జరిగే సమావేశాలకు భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.