: అవసరమైనప్పుడు రాజకీయాలపై మాట్లాడతా: లగడపాటి


రాష్ట్ర విభజన సమయం నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు తాను కొంతకాలంగా దూరంగా ఉంటున్నానన్నారు. అయితే, అవసరమైనప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతానని చెప్పారు. ఈ క్రమంలో మరికొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని లగడపాటి స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం పావడలో కమ్మ బాలికల వసతి గృహం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సమయంలోనే మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఆ విషయంపై ఇప్పట్లో చెప్పలేనన్నారు.

  • Loading...

More Telugu News