: మోదీ సభలకు ఉత్తుత్తి స్పందన: ఖుర్షీద్
విదేశాల్లో మోదీ సభలకు వస్తున్న స్పందన అంతా ఉత్తుత్తిదేనని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు. సభలకు వస్తున్న వారిని బీజేపీ యంత్రాంగం సమీకరిస్తోందని ఆయన అన్నారు. తను మయన్మార్ లోని నైపేత్యాలో రెండుసార్లు పర్యటించానని, అక్కడి వీధుల్లో ఎవరూ కనిపించరని అంటూ, మోదీ కోసం ఒక్కసారిగా 20 వేల మంది ఎక్కడినుంచి వచ్చారని ప్రశ్నించారు. ఈ స్పందన అంతా ఉత్తుత్తిదేనని ఆయన అన్నారు. కాగా, ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ 'అదంతా కాంగ్రెస్ దివాలాకోరుతనం' అన్నారు.