: వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాల పట్టు.. ప్రారంభమైన వెంటనే సభ వాయిదా
తెలంగాణ శాసన సభ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించాల్సిందేనని విపక్షాలు సభలో పట్టుబడుతున్నాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై వాయిదా తీర్మానం అందజేసిన కాంగ్రెస్ సభ్యులు చర్చ జరపాల్సిందేనని నినాదాలు చేశారు. దీంతో ప్రారంభమైన వెంటనే సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.