: 'శవ'మంటను చలిమంట అనుకున్నారు!


ఓవైపు శవం తగలబడుతుంటే అదేదో చలిమంటలే అనుకున్నారట మంగళగిరి వాసులు. గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్ స్టాండ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరో యువకుడిని గుర్తుతెలియని దుండగులు హతమార్చి దహనం చేసారు. మృతదేహంపై టైర్ లను కప్పి దహనం చేసారు. సోమవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. చుట్టూ నివాస స్థలాలు, దుకాణాలు ఉన్నప్పటికీ చలి మంట వేసుకున్నారులే అని అంతా అనుకున్నారు. కాసేపటికి అస్థిపంజరం కనిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News