: సినీ నటుడు బ్రహ్మాజీ కొడుకుపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరుల దాడి


ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ పై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులు అకారణంగా దాడికి దిగిన ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది. ఈ దాడిలో సంజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో ప్రకాశ్ గౌడ్ అనుచరులపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం... ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరిన సంజయ్, టోల్ గేటు వద్ద టోల్ చెల్లించేందుకు కారును ఆపారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వాహనంలోని వ్యక్తులు పలుమార్లు హారన్ కొట్టడమే కాక, వెంటనే అడ్డు తొలగాలని హుకుం జారీ చేశారు. టోల్ చెల్లించి కారు తీసేలోగానే వారు కిందకు దిగి సంజయ్ పై దాడి చేశారు. దీనిపై సంజయ్ ఫిర్యాదుతో పోలీసులు ప్రకాశ్ గౌడ్ అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News