: మన కెప్టెన్ కూడా సెంచరీ బాదాడు!


శ్రీలంకతో చివరి వన్డేలో 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందివ్వకపోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (100 బ్యాటింగ్) విలువైన సెంచరీతో ఆదుకున్నాడు. అంబటి రాయుడు (59)తో కలిసి మూడో వికెట్ కు 136 పరుగులు జోడించిన కోహ్లీ, అనంతరం, ఊతప్ప (19) జతగా నాలుగో వికెట్ కు 30 పరుగులు, కేదార్ జాదవ్ (20) తో కలిసి ఐదో వికెట్ కు 35 పరుగులు జోడించాడు. ఓవైపు, బ్యాట్స్ మెన్ వెనుదిరుగుతున్నా కోహ్లీ దూకుడు తగ్గలేదు. దీంతో, 43 ఓవర్లలో భారత్ 231 పరుగులు చేసింది. విజయానికి భారత్ 42 బంతుల్లో 56 పరుగులు చేయాలి. చేతిలో 5 వికెట్లున్నాయి. అంతకుముందు, టాస్ గెలిచిన శ్రీలంక రాంచీ పిచ్ పై బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (139 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News