: మరో పీక తెగింది... వీడియో విడుదల చేసిన ఐఎస్ఐఎస్


మధ్యప్రాచ్యంలో విధి నిర్వహణలో ఉన్న పాశ్చాత్యులను అపహరించి, వారిని కర్కశంగా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు మరో ఘాతుకానికి తెగబడింది. అమెరికా సేవా కార్యక్రమాల కార్యకర్త పీటర్ కాసిగ్ గొంతుకోసి చంపామంటూ ఆన్ లైన్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. వీడియోలో కాసిగ్ పక్కనే కత్తి పట్టుకుని నిలుచుని ఉన్న ఐఎస్ఐఎస్ మిలిటెంటు దారుణాన్ని వివరించాడు. బందీలుగా పట్టుకున్న సిరియా సైనికుల సామూహిక వధను కూడా ఈ వీడియోలో పొందుపరిచారు. ఐఎస్ఐఎస్ గ్రూపు ఇప్పటివరకు ఐదుగురు పాశ్చాత్యులను పీక కోసి చంపేసినట్టయింది. వారిలో ముగ్గురు అమెరికన్లు. బ్రిటన్ సేవా కార్యక్రమాల కార్యకర్త అలెన్ హెన్నింగ్ పీక కోసి, ఆ వీడియోను ఆన్ లైన్ లో పెట్టిన ఐఎస్ఐఎస్ గ్రూపు, ఆ వీడియో చివర్లో కాసిగ్ ను ప్రదర్శించింది. హెన్నింగ్ తర్వాతి వంతు కాసిగ్ దేనంటూ పేర్కొంది. దీంతో, కాసిగ్ కుటుంబం ఇస్లాంను స్వీకరించింది. తమ బిడ్డపై కరుణ చూపాలని వేడుకుంటూ కాసిగ్ తల్లిదండ్రులు ఓ వీడియోను యూట్యూబ్ లో పెట్టారు. తన కుమారుడి పేరు ఇప్పుడు అబ్దుల్ రహ్మాన్ అని మార్చేశామని, దయతో విడిచిపెట్టాలని కాసిగ్ తల్లి ఆ వీడియోలో వేడుకుంది. కానీ, ఈ కరడుగట్టిన మిలిటెంట్లు ఆ తల్లి పేగు ఆక్రందనలను పట్టించుకోలేదని తాజా వీడియో వెల్లడి చేస్తోంది.

  • Loading...

More Telugu News