: అధికారులను దూషించలేదు: చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడి వివరణ


విశాఖ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో సీఎంఓ అధికారులను తాను దూషించినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం చంద్రబాబుతో అయ్యన్న భేటీ అయ్యారు. అవినీతి అధికారిని బదిలీ చేయాలనే తాను డిమాండ్ చేశానని, ఈ విషయంలో తాను సీఎంఓ అధికారులను దూషించలేదని ఆయన వివరణ ఇచ్చారు. అధికారుల బదిలీల విషయంలో నెలకొన్న వివాదానికి తాను కారణం కాదని కూడా ఆయన చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News