: మహిళను చంపిన పెద్దపులి!
తేయాకు తోటలో పనిచేసున్న మహిళపై ఓ పెద్దపులి దాడి చేసి ఆమెను చంపేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూర్ సమీపంలోని పందరహళ్లి సమీపంలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం, సుమిత్ర (35) అనే యువతి భద్ర టైగర్ రిజర్వు ఫారెస్ట్ సమీపంలోని తేయాకు తోటలో కూలి పనికి వెళ్ళింది. పెద్దపులి దాడి చేయటంతో కేకలు వేసింది. పక్కన ఉన్న మిగతావారు పెద్దగా అరుస్తూ వెళ్లి చూడగా సుమిత్ర విగతజీవిగా పడి ఉంది. పులి ఆమె మెడను కొరికిందని, శరీరంపైనా పంజాతో దాడి చేసిందని పోలీసులు తెలిపారు. కాగా, గత సెప్టెంబర్ నుంచి అప్పుడప్పుడూ పులి తమకు కనిపిస్తూనే ఉందని కూలీలు తెలిపారు.